నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉన్నది. నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టులే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. వరుసగా ఎనిమిదో రోజు రాత్రి ఎల్‌వోసీ వెంబడి కాల్పులు జరిపారు. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, నౌషెరా, ఆఖ్నూర్ సెక్టార్లలో రాత్రివేళ చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. భారత సైన్యం ఇందుకు దీటుగా స్పందించిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ మంగళవారం హాట్‌లైన్‌లో కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని చర్చించినప్పటికీ పాక్ దాన్ని ఉల్లంఘిస్తున్నది.
నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులు..
- Advertisement -
RELATED ARTICLES