నవతెలంగాణ-హైదరాబాద్ : పాక్ ఆక్రమిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో విరుచుకుపడింది. ఈ వైమానిక దాడులపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఘాటుగా స్పందించారు. భారత్‌ది పిరికిపంద చర్య అని, పాక్ పౌరులు 8 మంది చనిపోయారని ఆయన ప్రకటించారు. ఇండియాలో తామ ఎప్పుడు.. ఎక్కడ.. ఏం చేస్తామో చెప్పమని హెచ్చరించారు.
కాగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ సైన్యం చేసిన వైమానిక దాడుల్లో 100 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత 1.44 గంటలకు పీవోకేతో పాటు పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. పక్కా ప్లానింగ్‌తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారవిడిచి వెనుదిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఇండియాలో ఎప్పుడు, ఎక్కడ, ఏం చేస్తామో చెప్పం: పాక్ విదేశాంగ్ర మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES