- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్తాన్ చరిత్రలో చట్టవ్యతిరేక, రహస్య అణు కార్యకలాపాలు కొత్తవి కావు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఎద్దేవా చేశారు. ఇస్లామాబాద్ అనేక దశాబ్దాలుగా అక్రమ రవాణా, ఎగుమతి నియంత్రణ ఉల్లంఘనలు, రహస్య భాగస్వామ్యాలు, ఏక్యూ ఖాన్ నెట్‌వర్క్ ద్వారా అణు విస్తరణ లాంటి చర్యల్లో పాలుపంచుకుంటూనే ఉందని ఆరోపించారు. ఈ విషయాలపై భారత్ అంతర్జాతీయ సమాజ దృష్టికి తీసుకెళ్తుందన్నారు. ఇటీవల రష్యా, చైనా, పాకిస్తాన్, ఉత్తర కొరియా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన విషయం తెలిసిందే
- Advertisement -


