Wednesday, May 14, 2025
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌ తమకు నిజమైన మిత్రదేశం: తుర్కియే అధ్యక్షుడు

పాకిస్థాన్‌ తమకు నిజమైన మిత్రదేశం: తుర్కియే అధ్యక్షుడు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్థాన్‌ తమకు నిజమైన మిత్రదేశమన్నారు. గతంలో మాదిరిగా భవిష్యత్తులోనూ అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా పాక్‌ ప్రధానిని విలువైన మిత్రుడిగా ఎర్డోగాన్‌ అభివర్ణించారు. తుర్కియేలో మాదిరిగానే పాకిస్థాన్‌లో శాంతి, స్థిరత్వాన్ని కోరకుంటున్నాం. వివాదాల పరిష్కారంలో చర్చలు, రాజీకి ప్రాధాన్యం ఇస్తున్న పాక్‌ ప్రభుత్వ విధానాన్ని అభినందిస్తున్నామని, గతంలో మంచి, చెడు సమయాల్లో మాదిరిగా.. భవిష్యత్తులోనూ పాక్‌కు అండగా ఉంటామ‌ని, పాకిస్థాన్‌-తుర్కియే దోస్తీ జిందాబాద్‌ అంటూ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ పేర్కొన్నారు. ప‌హ‌ల్గాం దాడికి ప్ర‌తీకారంగా ఆప‌రేష‌న్ సిందూర్‌తో భార‌త్… పాక్ పై దాడి చేసిన విష‌యం తెలిసిందే. పాకిస్థాన్ దేశానికి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ ట‌ర్కీ..భారీయోత్తున‌ డ్రోన్లు స‌ర‌ఫ‌రా చేసింది. ఆదేశ డ్రోన్ల‌ల‌తో భారత్ స‌రిహ‌ద్దు ప్రాంతాలపై పాక్ ఆర్మీ దాడుల‌కు తెగ‌బ‌డగా..ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ ఆ దాడుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టాయి. మ‌రోవైపు ట‌ర్కీ చ‌ర్య‌ల‌ను ఖండిస్తూ దేశీయంగా ఆ దేశ‌ పండ్ల‌ను, ప‌లు ర‌కాల వ‌స్తువుల‌ను బాయ్‌కాట్ చేయాల‌ని సోష‌ల్ మీడియావేదిక‌గా విస్త్రృతంగా ట‌ర్క్ బాయ్ కాట్ ఉద్య‌మం న‌డుస్తోంది. ఈక్ర‌మంలో తుర్కియే అధ్య‌క్షుని అగ్నికి ఆజ్యం పోసే చందంగా ఉన్నాయ‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -