నవతెలంగాణ-హైదారాబాద్: ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడితో భారత్ అట్టుడికింది. 26 మంది అమాయక పర్యాటకులను కిరాతకంగా ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన భారత్.. పాకిస్థాన్ దేశంపై పలు దౌత్యపరమైన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దు అత్తారి బార్డర్ మూసివేత, ఎంబీసీ కార్యాలయాల్లో సిబ్బంది కుదింపు, 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందంతో పాటు పాక్ పౌరులకు అన్ని రకాల వీసా అనుమతులను రద్దు చేస్తూ..ఈనెల 29లోగా వెళ్లిపోవాలని భారత్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో పాక్ పౌరులకు నేటితో మెడికల్ వీసా గడువు ముగియనుంది. దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులు దేశాన్ని వీడుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో పలు రకాల వైద్య చికిత్స కోసం ఇండియా వచ్చిన పాక్ జాతీయులు విమానాశ్రయాలకు బరాలు తీరారు. పహల్గాం ఉగ్రదాడి తమను శిక్షించడం సరైన నిర్ణయం కాదని పాక్ జాతీయులు వాపోతున్నారు. టూరిష్టులపై ఉగ్రదాడి జరగడం దారుణమని, ఈ తరహా ఘటనలు తాము ఖండిస్తున్నామని చెప్పారు. మరోవైపు భారత్ నిర్ణయాలను వ్యతిరేస్తూ పాకిస్థాన్ దేశం కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాల మూసివేతతో పాటు పలు ద్వైపాక్షిక ఒప్పందాలను రద్దు చేసింది. అంతేకాకుండా ఉన్నఫళంగా పాక్‌లో ఉన్న ఇండియాన్స్ వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో వివిధ కారణాలతో పాక్‌లో ఉన్న పలువురు భారతీయులు కూడా ఇండియాకు తరలివస్తున్నారు.
నేటితో ముగియనున్న పాక్ మెడికల్ వీసా గడువు
- Advertisement -
RELATED ARTICLES