నవతెలంగాణ-హైదరాబాద్ : భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకుంటూ భంగపాటుకు గురవుతున్న పాకిస్థాన్‌కు స్వదేశంలో మరో సంక్షోభం ఎదురైనట్లు తెలుస్తోంది. అక్కడ దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడినట్లు సమాచారం. దీంతో రాజధాని నగరమైన ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు పెట్రోల్ బంక్‌లు అన్నింటినీ మూసివేయాలని నిర్ణయించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
శనివారం నుంచి రాబోయే 48 గంటల పాటు ఇస్లామాబాద్‌లోని అన్ని పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లను పూర్తిగా మూసివేయాలని అక్కడి పరిపాలనా యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు నేటి ఉదయం తక్షణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ అనూహ్య నిర్ణయం వెనక కారణాలేంటనేది తెలియరానప్పటికీ.. ఇంధన కొరత కారణంగానే బంక్‌లను మూసివేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా నిల్వలను పెంచుకోవడం కోసమే ఈ చర్యలు చేపట్టి ఉంటుందని సమాచారం.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న పాకిస్థాన్‌ను.. భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం మరింత కుదేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం తీవ్రతరమైతే నిత్యావసరాల కొనుగోలుకు కూడా దాయాది వద్ద ఆర్థిక వనరులు ఉండవని అంటున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) ముందు మరోసారి సాయం కోసం అర్థించింది. తమ అభ్యర్థనను అంగీకరించి ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు అంగీకరించిందని పాక్ ప్రధాని కార్యాలయం తెలిపింది.
భారత్-పాక్ ఉద్రిక్తతలు..48 గంటల పాటు పెట్రోల్ బంక్‌లు మూసివేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES