Monday, March 30, 2026
E-PAPER
Homeఆటలుబాల్ టాంపరింగ్ ఆరోపణల్లో పాక్ ప్లేయర్లు

బాల్ టాంపరింగ్ ఆరోపణల్లో పాక్ ప్లేయర్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో బాల్ టాంపరింగ్ వివాదం పెద్ద దుమారం రేపుతోంది. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాహోర్ ఆటగాడు ఫఖర్ జమాన్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. మరో 48 గంటల్లో తదుపరి విచారణ జరగనుందని, ఆ తర్వాత తుది తీర్పు వెలువడుతుందని పేర్కొంది. లెవల్ 3 నేరంగా ఇది రుజువైతే, ఫఖర్‌పై కనీసం ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -