Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంయుద్ధం వస్తే పాకిస్థాన్ నాలుగు రోజులు నిలవదు: బాబా రాందేవ్

యుద్ధం వస్తే పాకిస్థాన్ నాలుగు రోజులు నిలవదు: బాబా రాందేవ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో యోగా గురువు బాబా రాందేవ్ పాకిస్థాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం తీవ్ర అంతర్గత సంఘర్షణలతో సతమతమవుతోందని, తనంతట తానుగానే విచ్ఛిన్నమయ్యే పరిస్థితికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ అంతర్గత పరిస్థితులపై రాందేవ్ మాట్లాడుతూ, “పాకిస్థాన్ ఇప్పటికే అంతర్గత పోరాటాలతో కొట్టుమిట్టాడుతోంది. బలూచిస్థాన్ ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది” అని అన్నారు. పాకిస్థాన్ సైనిక సామర్థ్యంపై మాట్లాడుతూ, “పాక్‌కు యుద్ధం చేసే శక్తి లేదు. ఒకవేళ భారత్‌తో యుద్ధం సంభవిస్తే, ఆ దేశం నాలుగు రోజులు కూడా నిలబడలేదు” అని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మనం కరాచీ, లాహోర్‌లలో గురుకులాలు నిర్మించాల్సిన అవసరం వస్తుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం, పాకిస్థాన్ నాయకత్వం భారత ప్రతీకార దాడుల గురించి తీవ్ర భయాందోళనలతో ఉందని బాబా రాందేవ్ అన్నారు. పాకిస్థాన్ తన సైన్యంపైనే నమ్మకం కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad