నవతెలంగాణ – అమరావతి: పహల్గామ్ దాడి తర్వాత పాకిస్థాన్‌పై తీవ్ర చర్యలకు ఉపక్రమించిన భారత ప్రభుత్వం దేశంలోని పాక్ పౌరులను వెనక్కి పంపిస్తోంది. ఇప్పటికే వందలాదిమంది పాక్ జాతీయులు దేశ సరిహద్దు దాటారు. ఈ క్రమంలో దేశంలో ఇంకా ఉన్న పాకిస్థాన్ జాతీయుల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సేకరిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ పౌరసత్వం కలిగి విశాఖపట్నంలో ఉంటున్న ఓ కుటుంబం నగర పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చీని కలిసింది. తమను వెనక్కి పంపకుండా చూడాలని వేడుకుంది. ఈ కుటుంబంలోని మహిళ, చిన్న కుమారుడు భారత పౌరసత్వం కలిగి ఉండగా భర్త, పెద్ద కుమారుడు పాకిస్థాన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో సీపీని కలిసిన కుటుంబం.. తమ సమస్యలు విన్నవించింది. పెద్ద కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతడికి విశాఖలో చికిత్స చేయిస్తున్నామని తెలిపింది. దీర్ఘకాల వీసా కోసం గతేడాది దరఖాస్తు చేసుకున్నామని, అది ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపింది. కాబట్టి తమను వెనక్కి పంపకుండా చూడాలని కోరారు. స్పందించిన సీపీ.. వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆ కుటుంబాన్ని పంపించారు.
విశాఖలో సీపీని కలిసిన పాకిస్థాన్ కుటుంబం..
- Advertisement -
RELATED ARTICLES