నవతెలంగాణ – హైదరాబాద్
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దాడులకు దిగిన పాకిస్థాన్‌కు ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిస్తోంది. పాకిస్థాన్ ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లు, మిస్సైల్స్‌ను కూల్చివేసింది. అలాగే పఠాన్‌కోట్ సెక్టార్‌లో పాకిస్థాన్‌కు చెందిన మూడు ఫైటర్ జైట్లను కూల్చివేసింది. వీటిలో ఎఫ్-16, రెండు జేఎఫ్-17 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్-16లో ఉన్న పాకిస్థాన్ పైలట్‌ను భారత సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే జలంధర్‌లో పాక్ డ్రోన్లను భారత రక్షణ వ్యవస్థను సమర్థవంతంగా అడ్డుకుంది. కాగా, పాకిస్థాన్ దాడులను భారత రక్షణ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. జమ్మూ, పఠాన్‌కోట్, ఉధమ్‌పూర్‌లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని వెల్లడించింది. డ్రోన్లు, మిస్సైల్‌తో ఈ దాడులకు తెగబడిందని చెప్పింది. మార్గదర్శకాల ప్రకారం ధీటుగా తిప్పికొడుతున్నామని స్పష్టం చేసింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. దేశ ప్రజల రక్షణ, సమగ్రతను కాపాడేందుకు పూర్తి సంసిద్ధతతో ఉన్నట్లు వెల్లడించింది.
ఇండియన్ ఆర్మీకి చిక్కిన పాకిస్థాన్ పైలట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES