నవతెలంగాణ-హైదరాబాద్: పహల్గాం ఉగ్రదాడితో..పాక్‌పై పలు దౌత్యపరమైన అంశాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారత్ ప్రభుత్వ నిర్ణయాలు జీర్ణయించుకోలేక దాయాది నేతలు కారుకూతలు కూస్తున్నారు. అమెరికా, బ్రిటన్ ల మెప్పును పొందడానికి.. పాకిస్థాన్ దేశంఉగ్రవాదానికి ఆర్థిక వెన్నదన్నలు అందించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్..ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగశాఖ మాజీ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో స్పందించారు. ఉగ్రవాదానికి పాక్ అండదండలు అందించిన విషయం తెలిసిన రహస్యంమే, కానీ అది ముగిసినా అధ్యయమని ఓ ప్రచార కార్యక్రమంలో చెప్పారు.పాకిస్థాన్ తీవ్రవాద చరిత్ర తిరస్కరించలేనిది. అయితే, అది ముగిసిన అధ్యాయం. అది మన చరిత్రలో ఒక దురదృష్ట భాగం’’ అని భుట్టో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడితో సింధు జలాలను నిలిపివేస్తు భారత్ తీసుకున్న నిర్ణయంపై భుట్టో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు నీళ్లు పారాకుంటే..రక్తం పారుతుందన్నారు.
ఉగ్రవాదానికి పాక్ అండదండలు నిజమే: బిలావల్ భుట్టో
- Advertisement -
RELATED ARTICLES