నవతెలంగాణ-హైదరాబాద్: సింధూ జలాలపై పాక్ మరోసారి మాటలతో కవ్వింపు చర్యలకు దిగింది.మా నీళ్లు ఆపితే.. మీ ఊపిరి ఆపుతాం..అని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాల్లో వెలువరించాయి. ఆ దేశంలో ఓ యూనివర్సిటీ కార్యక్రమనికి హాజరైన సందర్భంగా అహ్మద్ షరీప్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పలు కథనాలు ప్రచురించాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌కు సింధునదీ జలాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదాన్ని ఆపేంతవరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ మొదట్లోనే చెప్పింది. అంతకుముందుకు ఈ తరహా మాటలు పీపీపీ పార్టీ నేత బిలావాట్ భుట్టో జర్దారీ వ్యాఖ్యలు చేసి అబాసుపాలైడు.సింధూ నదీలో నీరు ప్రవహించకపోతే పాక్ ప్రత్యర్థుల రక్తం పారుతుందంటూ బిలావాల్ నోరు పారేసుకున్నారు. పహల్గాం దాడితో ఆగ్రహించిన భారత్..పాక్ ఉగ్రశిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 100మందిపైగా ఉగ్రవాదులు మరణించారు.
సింధూ జలాలపై పాక్ మరోసారి మాటలతో కవ్వింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES