నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో వ్యక్తిగత అనుకూల అభ్యసన(PAL)ను విస్తృతంగా వాడుకలోకి తెచ్చేందుకు ఏర్పడిన మార్గదర్శక సంస్థ పిఏఎల్ వర్క్స్ (PAL WORKS), ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. ఈ భాగస్వామ్యం- ఎడ్ టెక్ ఆవిష్కర్తలని, విద్యారంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలని, పరిశోధన నిపుణులని, ఎకోసిస్టమ్ ఎనేబులర్లని, ఫండర్లని, దాతృత్వ సంస్థలని, ప్రభుత్వరంగ సంస్థలని ఒకచోట చేర్చి, విభిన్న నైపుణ్యాలని ఏకంచేసి, ఎడ్యుకేషన్ టెక్నాలజీ (ఎడ్ టెక్ )ని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా, భారతదేశంలోని ప్రతి విద్యార్థి అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తుంది.
భారతదేశం తన విద్యా ప్రయాణంలో ఒక కీలకమైన దశలో ఉంది. భారత ప్రభుత్వం నిపుణ్ భారత్ మిషన్ (NIPUN) కింద ఫౌండేషనల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడాన్ని, రాష్ట్రాలలో డిజిటల్ అడాప్షన్ వేగంగా పురోగమించడాన్ని పరిగణలోకి తీసుకుంటే, సందర్భోచితమైన, ఋజువుతో కూడిన, టెక్-ఎనేబుల్డ్ సొల్యూషన్లను పెద్ద ఎత్తున అవలంబించే అవకాశం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. విద్యా వ్యవస్థలోని మేధావుల సమక్షంలో, పిఏఎల్ వర్క్స్ నిర్వహించిన ‘లెర్నింగ్ ఫర్ ఆల్, ఎట్ స్కేల్: ఎక్స్‌ప్లోరింగ్ ది రోల్ ఆఫ్ ఇన్నోవేషన్, టెక్, అండ్ పార్టనర్‌షిప్’ అనే సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు, భారతదేశ తరగతి గదులలో ఈ లక్ష్యాన్ని వాస్తవంగా మార్చడానికి ఏమేం అవసరమో చర్చించి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు.
పిఏఎల్ వర్క్స్ ఏర్పాటు, ఆవశ్యకత:
భారతీయ తరగతి గదులు వివిధ అభ్యసన స్థాయిలున్న విద్యార్థులతో చాలా వైవిధ్యంగా ఉంటాయి. అత్యంత నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయునికి కూడా ప్రతి విద్యార్థి వ్యక్తిగత అభ్యాస అవసరాలను తీర్చడం కష్టతరం అవుతుంది. దీని ఫలితంగా చాలా మంది విద్యార్థులు వారి తరగతి స్థాయి సామర్ధ్యాలని సాధించేందుకు కష్టపడుతున్నారు. ఈ పరిస్థితి అభ్యసన అంతరాలను పెంచడానికి, పాఠశాలనుండి డ్రాపౌట్ అవడానికి దారితీస్తుంది. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించటానికి ఈ సమస్యను విస్తృత స్థాయిలో పరిష్కరించడం చాలా ముఖ్యం.
పిఏఎల్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రతి విద్యార్థి అభ్యాస స్థాయిని అంచనా వేసి , దానికి తగ్గట్టుగా అభ్యసన విషయాన్ని, అభ్యసన వేగాన్ని మార్పు చేసి, సామర్ధ్యాల స్థాయికి తగిన బోధనను అందించడానికి టెక్నాలజీని ఉపయోగిస్తాయి. ఈ విద్యార్థి-కేంద్రీకృత విధానం ప్రతి చిన్నారి తమ స్వంత వేగంతో నేర్చుకోవడానికి వీలు కల్పించడమేగాక, అభ్యాస ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. భారతదేశంలో సగటు విద్యార్థి సంవత్సరంలో నేర్చుకునే దానికంటే రెండు రెట్లు ఎక్కువగా నేర్చుకోవడం దీనిద్వారా సాధ్యమవుతుంది. ముఖ్యంగా చదువులో వెనుకబడిన వారికి ఇది మరింత సహాయకారిగా ఉంటుంది. అంతే కాకుండా ఉపాధ్యాయులు కార్యాచరణ రూపొదించుకునేందుకు ఉపయోగపడే ఖచ్చితమైన డేటాని పిఏఎల్ అందిస్తుంది. భారతదేశం అంతటా మరింత సమగ్రమైన, ప్రభావవంతమైన తరగతి గదుల సృష్టికి పిఏఎల్ సహాయపడుతుంది.
భారతదేశంతో సహా అనేక దేశాల్లో, విభిన్నమైన తరగతుల్లో పిఏఎల్ ప్రభావవంతంగ పనిచేస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు తెలియజేసాయి. సమగ్ర శిక్ష ఐసిటి ఫ్రేమ్‌వర్క్, పీఎం శ్రీ మార్గదర్శకాలతో సహా ఎన్నో కీలకమైన నేషనల్ ఎద్యుకేషన్ ఫ్రేంవర్క్స్ దీన్ని ఆమోదించాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాల్లో పిఏఎల్ సొల్యూషన్స్ ఇప్పటికే అమలు చేయబడి వేలాది పాఠశాలలను, ఉపాధ్యాయులను, విద్యార్థులను చేరుకున్నాయి.
భారతదేశంలోని ప్రతి విద్యార్థి యొక్క ప్రయాణం ప్రత్యేకమైనదే. వేగంగా మారుతున్న ప్రపంచంలో అభ్యసనని వేగవంతం చేయడానికి సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం తప్పనిసరి. పిఏఎల్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. మన దేశం విద్యలోనూ, అభివృద్ధిలోనూ పురోగామిగ ఉండేలా కృషి చేసేందుకు, దానికి అవసరమైన కీలక భాగస్వాములందరితోనూ కలిసి పనిచేసేందుకు పిఏఎల్ వర్క్స్ కట్టుబడి ఉంటుంది.
పిఏఎల్ గురించి పలువురు మేధావుల అభిప్రాయాలు:
“భారతీయ తరగతి గదులలో అభ్యసన స్థాయిలు చాలా వైవిధ్యమైనవి. విద్యార్థులు అభ్యసన గ్రాఫులో విభిన్న పాయింట్ల వద్ద ఉంటారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలు మరియు బలాలలో కూడా వైవిధ్యం ఉంది. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ (పిఏఎల్) ఈ వైవిధ్యతను చాలా సమర్థవంతంగా పరిష్కరిస్తుందని నిరూపించబడింది. పిఏఎల్ వర్క్స్ భారతదేశ ఎడ్ టెక్ ఎకోసిస్టమ్ వృద్ధిని వేగవంతం చేస్తుందని, దేశవ్యాప్తంగా సహకారాన్ని, స్థిరమైన ప్రభావాన్ని పెంపొందిస్తుందని నేను ఆశిస్తున్నాను.”
– డాక్టర్ సంతోష్ మాథ్యూ, కంట్రీ లీడ్ – పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్, గేట్స్ ఫౌండేషన్
“పిఏఎల్ యొక్క ప్రభావం విప్లవాత్మకమని చెప్పడానికి సంకోచించే పని లేదు. క్షేత్రస్థాయిలో దీనిని అమలు చేసినప్పుడు, ఇది తరగతిగదిని ‘వన్ సైజ్ ఫిట్స్ ఆల్’ మోడల్ నుండి ప్రతి విద్యార్థి అభ్యాస ప్రయాణం ప్రత్యేకమైనదని గుర్తించి, తగిన మద్దతు ఇచ్చే శక్తివంతమైన వాతావరణంగా మారుస్తుంది. దేశవ్యాప్తంగా చాలా పాఠశాలలు ఏ ఆధారాలు లేకుండానే ఎడ్ టెక్ పరిష్కారాలను చాలా కాలంనుండి అమలుపరుస్తున్నాయి. పిఏఎల్ వర్క్స్ మరియు దాని సభ్యులు ఎంచుకున్న ‘ఎవిడెన్స్ బ్యాక్డ్ అప్రోచ్’ చూడటం నాకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. నిర్ధిష్టమైన ఆధారాలపై ఆధారపడిన పిఏఎల్ వంటి పరిష్కారాలు భారతదేశంలో విద్య యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి”
– కె. సంధ్యా రాణి, బోర్డు సభ్యురాలు- క్రిస్ప్ ( CRISP) , మాజీ కమిషనర్, స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
“పిఏఎల్ వర్క్స్ ఏర్పాటు, భారతదేశ విద్యా వ్యవస్థలో ఒక కీలకమైన అడుగును సూచిస్తుంది. ఈ కలెక్టివ్, ఎడ్ టెక్ ఆవిష్కర్తల లోతైన నైపుణ్యాన్ని, సాంకేతిక భాగస్వాముల కార్యాచరణ శక్తిని, నిపుణుల పరిశోధన సామర్థ్యాలని, సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ వంటి ఎకోసిస్టమ్ ఎనేబులర్లని ఒకచోట చేర్చుతోంది. పిఏఎల్ వంటి ఋజువు-ఆధారిత(evidence based) అభ్యాస విధానానికి అవసరమైన గతివేగాన్ని పిఏఎల్ వర్క్స్ సృష్టించగలుగుతుంది. అభ్యసనకోసం ఎడ్ టెక్ ను ఉపయోగించడం మా వ్యవస్థ-సంస్కరణ కార్యకలాపాలలో కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థుల అభ్యసన ఫలితాలలో ఆశాజనకమైన ఫలితాలను మేము చూస్తున్నాము. విద్యార్థులందరూ నేర్చుకుని అభివృద్ధి చెందే “వికసిత్ భారత్” పునాది వేయడంలో పిఏఎల్ పోషించగల పాత్ర గురించి మేము ఆసక్తిగా ఉన్నాము. దానికి కావాల్సిన మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము.”
– శవేత శర్మ-కుక్రేజా, సీఈఓ మరియు ఎండి , సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్