Tuesday, January 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇజ్రాయిల్‌ దాడుల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్‌ కుటుంబాలు

ఇజ్రాయిల్‌ దాడుల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్‌ కుటుంబాలు

- Advertisement -

వెస్ట్‌బ్యాంక్‌లోని స్థిరనివాసాలపై దురాక్రమణ : ఐరాస నివేదిక వెల్లడి
ట్రంప్‌ పీస్‌ ఆఫ్‌ బోర్డు ఏర్పాటు చేసినా ఆగని దుశ్చర్య
గాజా :
ఓవైపు ట్రంప్‌ పీస్‌ ఆఫ్‌ బోర్డు ఏర్పాటుచేశానంటుంటే…మరోవైపు ఇజ్రాయిల్‌ దుశ్చుర్యలు అస్సలు ఆగటంలేదు. వెస్ట్‌బ్యాంక్‌లోని స్థిరనివాసాలపై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల్లో రెండువారాల్లో వందలాది పాలస్తీనియన్‌ కుటుంబాలు నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్‌ఏ) తెలిపింది. దీనికి సంబంధించి నివేధికను సోమవారం విడుదల చేసింది.
ఇందులో అధికశాతం మంది జెరిఖో గవర్నరేట్‌లోని రాస్‌ ఐన్‌ అల్‌-అవుజాకు చెందిన బెడౌయిన్‌లని, అదే సమయంలో ఐదు ఇతర వెస్ట్‌బ్యాంక్‌ కమ్యూనిటీలు బలవంతంగా తరలించారని నివేదికలో తెలిపింది. రాస్‌ ఐన్‌ అల్‌-అవుజా ప్రాంతంలో స్థిరపడిన ఇజ్రాయిల్‌ కుటుంబాలు పాలస్తీనియన్లపై అమానుషంగా వ్యవహరిస్తున్నారని, రాత్రిపూట దాడులకు, బెదిరింపులకు దిగడం, దుర్భాషలాడటంతో పాటు ఇళ్లను కూల్చివేసాయని నివేధిక స్పష్టం చేసింది. నిరాశ్రయులైన కుటుంబాల్లో ్ల 186మంది మైనర్లు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈనెల మొదటి వారంలో 110మందితో కూడిన 21కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారని, ఆ సమయంలో ఒక వృద్ధుడిపై భౌతికంగా దాడికి దిగడంతో పాటు సోలార్‌ పవర్‌ కేబుల్స్‌ను విధ్వంసం చేశారని పేర్కొంది.
శుక్రవారం నబ్లస్‌ నగరానికి దక్షిణాన ఉన్న వ్యవసాయ భూమిలో పనిచేస్తున్న రైతుపై ఇజ్రాయిలీ దళాలు కాల్పులు జరిపటంతో అతను మరణించాడని తెలిపింది. దాడి సమయంలో అంబులెన్స్‌ బృందాలు ఆప్రదేశానికి రాకుండా ఇజ్రాయిల్‌ సైన్యం అడ్డుకున్నాయని పాలస్తీనా రెడ్‌ క్రెసెంట్‌ సంస్థ పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -