- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఆ వార్డులో మొత్తం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. ఇద్దరికి ఎన్నికల సంఘం పక్షాన వచ్చిన బ్యాలెట్ పత్రాల్లో గుర్తులను కేటాయించారు. కానీ మూడో అభ్యర్థి యాదయ్యకు గుర్తు కేటాయించకపోవడంతో గమనించిన ఓటర్లు ఎన్నికల అధికారులకు ఫర్యాదు చేయగా.. పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
- Advertisement -



