- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గురువారం తొలివిడతలో భాగంగా 3,834 సర్పంచి.. 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపును అధికారులు నిర్వహిస్తున్నారు. సర్పంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.
- Advertisement -



