Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి 

సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి 

- Advertisement -

నవతెలంగాణ -తాడ్వాయి 
మండలంలోని బీరెల్లి గ్రామపంచాయతీ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వర్తిస్తున్న పంచాయతీ కార్యదర్శి గ్రామంలోని సమస్యలను పట్టించుకోవడంలేదని, ఆయనను ఇక్కడి నుండి తీసేసి, వేరే మంచి కార్యదర్శిని మా (బీరెల్లి) ఊరుకు వేయాలని బాగే రాములు, గడదాసు గోపి, నూశెట్టి రాము, మంతెన సత్యం, ఇర్సవడ్ల ముత్తయ్య, బెజ్జూరి రత్తమ్మ అనే గ్రామస్తులు సోమవారం పనిచేయని బోరు వద్దకు వచ్చి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి ఇప్పటికీ సుమారు 18, 20 రోజుల నుండి బీరెల్లి గ్రామానికి రావడం లేదని మండిపడ్డారు. ఎప్పటికీ ఫోన్ చేస్తే ఇన్చార్జి గ్రామం దామరవాయి లో ఉన్న అని, లేదంటే మండల ఆఫీస్ పని ఉన్నది అక్కడనే ఉన్న అని సమాధానం చెబుతున్నారని వారు వాపోయారు. బీరెల్లి గ్రామంలో గత 20 రోజుల నుండి బెజ్జూర్ శ్రీకాంత్ పరిసర వాడలో నీరు లేక గ్రామస్తులు ఇబ్బందు పడుతున్నారని అన్నారు. గత 20 రోజుల క్రితం గ్రామస్తులమైన మేమే స్టార్టర్ ను మరమ్మతులు చేసుకుని బోరు నడిపించుకున్నామని, నీటి సమస్య తీర్చుకున్నామని, ఆ బోరు మళ్లీ స్టార్టర్ కరాబై దాదాపు సుమారు 20 రోజులు అయిందని వారు ఆవేదన చెందారు. ఇప్పటివరకు మాకు తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన చెందారు. పంచాయతీ కార్యదర్శి గ్రామస్తుల మీద దురుసుగా కూడా ప్రవర్తిస్తున్నాడని వారు మండిపడ్డారు. “ఏం చేస్తారో చేసుకోండి” అని కూడా దురుసుగా మాట్లాడుతున్నాడని వారు వాపోయారు. జిల్లా కలెక్టర్, డిపిఓ లు వెంటనే స్పందించి ఆ పంచాయతీ కార్యదర్శిని పరిశీలించి ఆయనపై చర్యలు తీసుకొని, బీరెల్లీ గ్రామం నుంచి తొలగించాలని, వేరే కార్యదర్శిని మా గ్రామానికి వేయాలని వారు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -