Wednesday, May 21, 2025
Homeతెలంగాణ రౌండప్వడదెబ్బతో పంచాయతీ కార్మికుడి మృతి

వడదెబ్బతో పంచాయతీ కార్మికుడి మృతి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు(కాటారం)
కాటారం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పారి శుధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్(35) మంగళ చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం… కాళేశ్వరం సరస్వతీ పుష్క రాల్లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్. రెండ్రో జుల క్రితం ఎండ తీవ్రతకు అస్వస్థతకు గుర య్యారు.తాత్కాలికంగా చికిత్స చేయించి పంపించారు.మంగళవారం అర్ధరాత్రి తీవ్ర అస్వ స్థతతో పరిస్థితి విషమించి మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. శ్రీనివాస్ కుటుంబాన్ని జిల్లా పంచాయతీ అధికారి వీరభద్రయ్య, ఎంపీడీవో బాబు, ఎంపీవో వీరస్వామి, పంచాయతీ కార్య దర్శి బీరెల్లి కరుణాకర్లు పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. తక్షణ సాయంగా రూ.10వేల ఆర్ధికసాయాన్ని అందజేశారు. కార్మి కుడి భార్య విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల సంఘ నాయకులు శశికుమార్, పప్పుల లక్ష్మయ్యలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -