- Advertisement -
నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణానికి చెందిన పాలకుర్తి కాశయ్య (రిటైర్డ్ పోలీస్ అధికారి )కుమారుడు సందీపు నిజామాబాద్ డిప్యూటీ కలెక్టర్గా నియామకమయ్యారు. ఆయనను బిజెపి పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. తన సోదరుడు పాలకుర్తి సందీపు బాబాయ్ కాశయ్య స్ఫూర్తితో వ్యవసాయ శాఖ వ్యవసాయక అధికారిగా పనిచేస్తూనే ఇటీవల జరిగిన గ్రూపు 1 పరీక్ష రాసి గ్రూపు వన్ లో 80 శాతం మార్కులు సాధించి డిప్యూటీ కలెక్టర్గా నియామకం కావడం ఎంతో గర్వంగా ఉందని పాలకుర్తి తిరుపతి అన్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా నిలిచాడంటు కొనియాడారు. భవిష్యత్తులో సందీప్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
- Advertisement -