– నిన్న తిమ్మాపూర్ నేడు జోగాపూర్ లో అమ్మాయిల మిస్సింగ్
నవతెలంగాణ-చందుర్తి : వరుస మిస్సింగ్ లతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారు. నిన్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక అదృశ్యం అయిన ఘటన మరువక ముందే గురువారం జోగాపూర్ గ్రామానికి చెందిన పులి ప్రత్యుశ రాత్రి 12 గంటల సమయంలో ఇంటి నుండి వెళ్లి పోయింది. దీంతో అమ్మాయి తల్లి పద్మ పిర్యాదు మేరకు ఎస్సై రమేష్ కేసు నమోదు చేశారు. సిసి ఫుటేజ్ ఆధారంగా ఘటన వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయి ఫోన్ ఆధారంగా ఆమె ఉన్న స్థలం ను గుర్తుంచినట్లుగా సమాచారం ఏది ఏమైనా వరుస మిస్సింగ్ పై అటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైవుగా తరుచూ అదృశ్యం కేసుల పై పోలీసుల కు తల నొప్పిగా మారింది.
వరుస మిస్సింగ్ తో తల్లి తండ్రులు ఆందోళన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



