నవతెలంగాణ-హైదరాబాద్: 12 గంటలకు వాయిదాపడిన లోకసభ పునర్ ప్రారంభమైంది. అంతకు ముందు లోకసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాపడింది. సభ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. సభలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేయడంతో.. కేవలం రెండు నిమిషాలకే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.భారత్ అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై సభలో చర్చ జరపాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సస్పెండైన సీపీఐఎం తో పాటు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టారు. రాహుల్ గాంధీ సభలో మాట్లాడే అవకాశమివ్వాలని, యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్, నరవాణీ ప్రస్తావించిన బుక్‌లోని అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ వాయిదాల పర్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



