Wednesday, July 23, 2025
E-PAPER
HomeజాతీయంParliament Session : కొనసాగుతున్న వాయిదాల పర్వం

Parliament Session : కొనసాగుతున్న వాయిదాల పర్వం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజైన బుధవారం కూడా ఉభయ సభల్లో విపక్ష సభ్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. బీహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సరవణపై ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు డిమాండ్‌ చేశారు. ఓటర్ల సవరణ ప్రజాస్వామ్యా హక్కులకు విఘాతమని పేర్కొన్నారు. ఈ మేరకు పలువురు ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాయిదా తీర్మానాలపై చర్చకు సభ్యులు డిమాండ్‌ చేశారు. విపక్షాల ఆందోళనల మధ్య ఉభయసభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -