- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించబడతాయి. మొదటి విడత నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో, ప్రతిపక్షాలు MGNREGA, SIR, UGC 2 అంశాలపై చర్చలు పెట్టాలని డిమాండ్ చేశాయి.
- Advertisement -



