Wednesday, March 18, 2026
E-PAPER
Homeజాతీయంవచ్చే వారంతంలో పార్లమెంట్‌ సమావేశం

వచ్చే వారంతంలో పార్లమెంట్‌ సమావేశం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పార్లమెంట్‌ వచ్చే వారాంతంలో ( మార్చి 28-29 తేదీల్లో) సమావేశం కానుంది. గురువారం ‘ఉగాది’, శుక్రవారం ‘రంజాన్‌’ సెలవులు కావడంతో.. పార్లమెంట్‌ వచ్చే వారాంతంలో సమావేశం కానుందని సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. గురువారం ‘ఉగాది’ శుక్రవారం ఈద్‌ సెలవులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 19,20 తేదీల్లో చేపట్టాల్సిన వివిధ మంత్రిత్వ శాఖల ప్రశ్నలను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. సుధీర్ఘ వారాంతం కారణంగా, వచ్చే శని, ఆదివారాలైన మార్చి 28,29 తేదీల్లో సభ యథావిథిగా పనిచేస్తుంది. అయితే ఆరోజుల్లో ఎటువంటి ప్రశ్నలు చేపట్టడం లేదు. రాజ్యసభలోనూ ఇటువంటి ప్రకటన చేశారు. గతంలో కూడా సభ వారంతంలో పనిచేసింది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్‌ ఫిబ్రవరి 1వతేదీ ఆదివారం సమావేశమైన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -