- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 21వరకు సాగనున్నాయి. నెల రోజుల పాటు సాగే పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ సమావేశాల్లో వివిధ అంశాలకు చెందిన ఎనిమిది బిల్లులను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
పార్లమెంట్ ముందుకు వెళ్లే 8 బిల్లులు ఇవే..
- వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025
- పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025
- పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025
- జియో-హెరిటేజ్ సైట్స్ & జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025
- గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025
- జాతీయ క్రీడా పరిపాలన బిల్లు 2025
- జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025
- Advertisement -