మానవీయకోణంలో చేపట్టిన సంక్షేమ పథకమిది
సిమెంట్, స్టీలు పరిశ్రమల యజమానులకు భట్టి వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రభుత్వం మానవీయకోణంలో, ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రంలోని సిమెంట్, స్టీలు పరిశ్రమలు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం హైదరా బాద్‌లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సిమెంట్, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వీటి నిర్మాణానికి ధరలు తగ్గించి నాణ్యమైన సిమెంట్, స్టీలును అందిం చాలని పరిశ్రమల యజమానుకు విజ్ఞప్తి చేశారు. ”పేద కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అమలు అవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్స హిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పరిశ్రమలు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. భవిష్యత్‌లో సిమెంట్, స్టీలు ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఏర్పడు తుంది, ఈ క్రమంలో పెద్ద, చిన్న అనే అంతరం లేకుండా కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలు సరఫరా చేయండి” అని వారికి మంత్రులు సూచిం చారు. పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో ప్రభుత్వ పథకాలకు సిమెంట్ కంపెనీలు అందిస్తున్న ధరను సమావేశంలో వారు సమీక్షించారు.
4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరం అవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులకు వివరించారు. పరిశ్ర మల శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణా నికి అవసర మైన సామాగ్రిని సరఫరా చేసే అంశం పై త్వరలో సమావేశమై తుది ధరలు ఖరారు చేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగస్వాములుకండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES