Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనండి

ఎన్‌హెచ్‌ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొనండి

- Advertisement -

– మంత్రి కోమటిరెడ్డికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాలో సోమవారం జరగనున్న జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన, ఆ శాఖకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మేరకు ఆదివారం లేఖ రాశారు. గడ్కరీ ఢిల్లీ నుంచి సోమవారం 8 గంటలకు బేగంపేట్‌ విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆసిఫాబాద్‌ జిల్లాకు చేరుకుంటారు. జాతీయ రహదారికి శంకుస్థాపన అనంతరం ఆయన హైదరాబాద్‌కు చేరుకుని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -