Thursday, December 25, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బాసరలో వైభవంగా చిత్ర కవిత ‘సౌరాభం’ భాగాల ఆవిష్కరణ

బాసరలో వైభవంగా చిత్ర కవిత ‘సౌరాభం’ భాగాల ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన బాసరలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పొద్దుటూరు ప్రాంతానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు, పరిశోధకుడు, కవి రచించిన చిత్ర కవిత ‘సౌరాభం’ మూడవ, నాలుగవ, ఐదవ భాగాలపుస్తక ఆవిష్కరించన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో  డార్మెన్ట్ హాల్ లో కర్నూలు కు చెందిన కవి,పరిశోధక రత్న శ్రీమాన్ వైద్యం వెంకటే శ్వరాచార్యులు,సమస్య పృచ్ఛక చక్రవర్తి  శ్రీమాన్ కంది శంకరయ్య ,శ్రీమాన్ పూసపాటి కృష్ణ సూర్య కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పండితులు, సాహితీవేత్తలు, కవులు, కళాప్రేమికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

చిత్ర కవిత్వం ద్వారా సమాజానికి అందించిన భావ వైభవం, సాంస్కృతిక పరిమళం అందరినీ ఆకట్టుకుంది. కవి తన రచనల్లో ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, మానవ విలువలను సమన్వయపరిచి సమాజానికి చక్కటి సందేశాన్ని అందించారని వక్తలు ప్రశంసించారు. కార్యక్రమంలో భాగంగా చిత్ర కవిత భాగాల ఆవిష్కరణ, కవి ప్రసంగం, సాహిత్య చర్చా వేదికలు నిర్వహించారు. బాసర వంటి పవిత్ర క్షేత్రంలో ఈ తరహా సాహిత్యోత్సవం జరగడం గర్వకారణమని  పుస్తక రచయిత ప్రొద్దుటూరి అలంకారం వేంకట రమణ రాజు  అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమం ద్వారా తెలుగు సాహిత్యానికి మరింత వెలుగు చేకూరిందని  పేర్కొన్నారు.ఈకార్యక్రమంకు పరిశోధకర్త కర్నూలు శ్రీమాన్ వై ద్యం వెంకటేశ్వరాచార్యులు, సమస్య పృచ్ఛక చక్రవర్తి కంది శంకరయ్య, పూసపాటి కృష్ణ సూర్యకుమార్,డా భోచ్కర్ ఓం ప్రకాష్ పాల్గొని మాట్లాడారు. రమణ రాజు గారు ఇదివరకు తెలుగు సాహిత్యం పై ప్రేమతో ఎన్నో గ్రంథాలు రాసి ఎందరోని చైతన్యవంతం చేశారని కొనియాడారు. తెలుగులో కందపద్యం పరిశోధన వ్యాసం చిత్ర కవిత పరిచయం అవగాహన పొడుపు కథలు ప్రహేళికలు సూక్తి సుధా మధురం ఏకాక్షర నిఘంటువు చమత్కార పద్యాలు సాహిత్య వినోదవీచికలు ,చిత్ర కవిత సౌరభం ఇలా అనేక కవితలు ఖండికలు రాసి ఎందరో మంది చే మన్నాలు పొందుతున్నారని గుర్తు చేశారు  తెలుగు  ఔన్నత్యాన్ని తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచం కు చటాలన్న సదుద్దేశంతో పాటు సామాజిక సాంస్కృతిక సాంప్రదాయ విలువలతో పాటు తెలుగు భాషాగోప్పదన్నాని పెంపొందిచేందుకు ముందకెళ్తున్నారన్నారు.

ఎన్నో రచనలు చేశారని కొనియాడారు ఇతను రచించిన చిత్ర కవిత సౌరాభం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా రచయితకు అతిథిలకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవులు కడారి దశరథ్ ,పీసర శ్రీనివాస్ గౌడ్ ,గంగుల చిన్నన్న, జాదవ్ పండలిక్ రావు,  కొండూరు పోతన్న, బసవరాజు, అశోక్ కుమార్ ,అలాగే ఆంధ్రప్రదేశ్  లోని పొద్దుటూరు కవులు కళాకారులు అష్టవదానాలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -