Friday, February 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపార్టీ ఫిరాయింపుల కేసు.. గ‌డువు పొడిగింపు

పార్టీ ఫిరాయింపుల కేసు.. గ‌డువు పొడిగింపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసు విచార‌ణ‌పై సుప్రీంకోర్టు గ‌డువు పొడిగించింది. మూడు వారాల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని పేర్కొంది. స్పీకర్ పాటించని పక్షంలో అప్పుడే ధిక్కరణ చర్యలపై ఆలోచిస్తామని వెల్లడించింది. ఇప్పటికే వ‌ర‌కు స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది మోహిత్‌రావు తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టుకు స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వివరించారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఇరువురి వాద‌న‌లు విన్న కోర్టు తాజాగా మూడు వారాల గ‌డువును మంజూరు చేసింది. అయితే ఇప్పటి వ‌ర‌కు విచార‌ణ‌కు హాజ‌రైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ క్లీన్ సీట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై స్ప‌ష్ట‌మైన ఆధారాలు లేవ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -