నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చే రోగులను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో స్పందించి సరైన చికిత్స అందించాలని వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం డిప్యూటీ తహసిల్దార్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఆస్పత్రికి వచ్చే రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించకుండా , కనీసం జ్వర తీవ్రతను చూడకుండా ఆస్పత్రి వైద్యులు మందులు అందిస్తున్నారని వినతిలో ఆరోపించారు.
ప్రభుత్వాస్పత్రికి వచ్చే పేదల పట్ల చిలుక నా భావం లేకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వారి జబ్బులు నయం చేసేందుకు మందుల అందించాలని సూచించారు. నిర్లక్ష్యం చేసే వైద్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని నిధిలో కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుట్టారామిరెడ్డి , మాజీ ఉప సర్పంచ్ నిరంజన్ మాజీ ఎంపిటిసి లింగం, నిరంజన్ , యువ నాయకులు గండికోట రాజు, ప్రవీణ్, రవి , రఘు, జగన్ , దాసు తదితరులు పాల్గొన్నారు.ఫోటో. తహసిల్దార్ కు వినతిపత్రం అందిస్తున్న నాయకులు
రోగులకు సరైన చికిత్స అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES