Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుపవన్ కళ్యాణ్ రాజకీయ తుఫాన్: రజనీకాంత్

పవన్ కళ్యాణ్ రాజకీయ తుఫాన్: రజనీకాంత్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ ట్వీట్ చేశారు. దానికి పవన్ ఇచ్చిన వినమ్రమైన సమాధానం వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ సినీ కెరీర్ లో 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు ప్రతిస్పందనగా రజినీకాంత్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా ప్రియమైన సోదరుడు, రాజకీయ తుఫాన్ పవన్ కల్యాణ్ గారూ.. మీ ఆత్మీయ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి” అని తన పోస్టులో పేర్కొన్నారు. పవన్‌ను తలైవా ‘పొలిటికల్ తుఫాన్’ అని సంబోధించడం ఈ పోస్టులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad