నవతెలంగాణ – అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా “మన ఊరు – మాటామంతి” అనే పేరుతో ప్రజలతో ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని థియేటర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలతో మాట్లాడారు. రావివలస గ్రామస్తులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో అమలు చేస్తున్న అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, వైద్యం, విద్య,. మౌలిక వసతులపై ప్రజలతో చర్చించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పనులపై అభిప్రాయాన్ని సేకరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు కూడా మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వెండితెరపై రైతులతో పవన్ వీడియో కాన్ఫరెన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES