నవతెలంగాణ – హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, తమిళ హీరో అజిత్ కుమార్ సోమవారం పద్మభూషణ్ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. నిన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -