Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెండింగ్‌ బిల్లులు చెల్లించి

పెండింగ్‌ బిల్లులు చెల్లించి

- Advertisement -

మా ప్రాణాలు కాపాడండి

రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ హైదరాబాద్‌లో మహాధర్నా

నవతెలంగాణ – ముషీరాబాద్‌
పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించి తమ ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ ఎలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సర్పంచులు మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హాజరై సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్పంచులు వడ్డీకి డబ్బులు తెచ్చి గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత రెండేండ్లుగా వడ్డీ పెరిగిపోతుండటంతో వారు వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి బిల్లులు చెల్లించి సర్పంచుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. 12,560 మంది సర్పంచులకు సంబంధించి దాదాపు రూ.600 కోట్ల బకాయిలు ఉంటాయని, సీఎం తలుచుకుంటే ఒక్క రోజులో వారి సమస్యలు తీరుతాయన్నారు. సర్పంచులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాలు చేస్తే ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. జేఏసీ అధ్యక్షులు యాదయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించి తమ ప్రాణాలను కాపాడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా కనికరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి దళ్‌ పార్టీ అధ్యక్షులు పృథ్వీరాజ్‌, సర్పంచ్‌ జేఏసీ ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్‌ రెడ్డి, రంపక నాగయ్య, కోశాధికారి పూడూరి నవీన్‌ గౌడ్‌, కేశ బోయిన మల్లయ్య, భూమన్న యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ ొ హైదరాబాద్‌లో మహాధర్నా

RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -