నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ ఘర్షణలను పరిష్కరించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ఇటీవలే బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి మండలి)ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ వాషింగ్టన్‌లో ట్రంప్ అధ్యక్షతన శాంతి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో సహా 20కి పైగా ప్రతినిధులు, పలువురు నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో గాజా ప్రాంతంలో అంతర్జాతీయ సైనిక దళ మోహరింపుకు సంబంధించిన వివరాలపై దృష్టి సారించే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఈ శాంతి మండలిలో యుఎఇ, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఖతర్, టర్కీ, అర్జెంటీనా, పరాగ్వేలు చేరాయి. ఈ దేశాల నేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ కౌన్సిల్‌లో అమెరికాకు మద్దతుగా నిలిచింది ఇజ్రాయిల్‌నే. కనుక కచ్చితంగా ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఈ సమావేశంలో పాల్గొంటారు. మెక్సికో, రొమేనియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్‌లు పాల్గొంటాయి. అమెరికా మిత్ర దేశాలు, అనేక మధ్యప్రాచ్య దేశాలు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఈ కౌన్సిల్ చేరినప్పటికీ.. జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. .



