Sunday, May 11, 2025
Homeరిపోర్టర్స్ డైరీశాంతి మంత్రం.. దేశద్రోహం…

శాంతి మంత్రం.. దేశద్రోహం…

- Advertisement -

మనకిష్టమైన వాడు ఎంత కష్టపెట్టినా భరిస్తుంటాం. వాడు ఏం చెప్పినా ఓకే అంటాం. ఇది మనిషి సహజ స్వభావం. దాయాది దేశం పాకిస్తాన్‌తో మనకు ఇటీవల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తటం, ఆ తర్వాత దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటోందంటూ పతిక్రలు, మీడియా హడావుడి చేయటంతో సాధారణ పౌరుల నుంచి మేధావుల వరకూ ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించటంతో ‘హమ్మయ్య…’ అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి వర్థిల్లాలి, యుద్దోన్మాదం నశించాలంటూ అందరూ నినదించారు. అయితే ఇక్కడో విషయం మరింత చర్చనీయాంశమైంది. కాల్పుల విరమణ గురించి భారత్‌, పాక్‌ ప్రభుత్వాధినేతలు, ఆర్మీ అధికారుల కంటే ముందుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మామ స్పందించంటం. ‘కాల్పుల విమరణకు ఇరు దేశాలు అంగీకరించాయి…’ అంటూ ఆయన విజయ సంకేతం చూపుతూ ట్వీట్‌ చేశారు. ఆ వెంటనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో సైతం మాట్లాడటం గమనార్హం. ‘మేం భారత్‌, పాక్‌ ప్రధానులు మోడీ, షెహబాజ్‌ షరీఫ్‌తోపాటు ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులతో మాట్లాడాం..’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ శాంతి చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కూడా పాల్గొన్నట్టు ఆ దేశ మీడియా ప్రకటించింది. విషయమేమంటే… భారత్‌, పాక్‌లకు సంబంధించిన విషయాల గురించి ఈ రెండు దేశాల కంటే ఎక్కువగా అమెరికా ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించటం గమనార్హం. ఇప్పుడు ట్రంప్‌ మామ శాంతి మంత్రం చెప్పాడు కాబట్టి.. ఓకే, అదే వేరే వారు దీని గురించి మాట్లాడితే… ఇప్పటికే మన దగ్గర వాళ్లు దేశద్రోహులు అయిపోయేవారంటూ నెట్టింట కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి…
-కేఎన్‌ హరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -