– తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్
నవతెలంగాణ -తాడ్వాయి
కర్రెగుట్ట ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగారును ఆపాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు నిర్వహించాలని ఆదివాసి, దళిత, గిరిజన, ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రేపు ములుగులో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దుల్లో గల కర్రెగుట్ట యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుందన్నారు. సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆదివాసి, గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయానక వాతావరణంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు సేకరించుకోలేని దీన స్థితిలో, వారికి వారే చనిపోయే స్థితికి చేరుకున్నారని ఆయన ఆవేదన చెందారు. వేలాది సాయిధ పోలీస్ బలిగాలు తిష్ట వేసుకుని ఏకపక్ష దాడుల్ని కొనసాగించడం దాన్ని ఆపాలని వారు డిమాండ్ చేశారు. అడవి ప్రకృతి కనీసంపదను అంబానీ ఆధానీలకు అప్పజెప్పే కుట్టల్లో భాగంగానే ఆదివాసి ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. కర్రెగుట్ట ప్రాంతం నుంచి పోలీసు బదులు వెంటనే ఉపసంహరించాలని, అరెస్టు చేసిన ఆదివాసి గిరిజనులను వదిలిపెట్టాలని, ఆపరేషన్ కగారును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూచించారు. మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో శాంతి చర్చలకు తాము సిద్ధమని పదే పదే ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు ఆపి, తక్షణమే మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకుల, గిరిజన సామాజిక వేదక నాయకులు, ములుగు జిల్లా సాధన సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ ను ఆపాలని రేపు ములుగులో శాంతి ర్యాలీ..
- Advertisement -
RELATED ARTICLES