Thursday, March 26, 2026
E-PAPER
Homeనిజామాబాద్బీసీ టైమ్స్ & బీసీ సమాజ్ ఆధ్వర్యంలో పెద్ద తడగూర్ సర్పంచ్ కు సత్కారం

బీసీ టైమ్స్ & బీసీ సమాజ్ ఆధ్వర్యంలో పెద్ద తడగూర్ సర్పంచ్ కు సత్కారం

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో సర్పంచులుగా ఎన్నికైన రజక సర్పంచులకు ఆత్మీయ అభినందన సత్కార సభ హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో నిర్వహించారు. మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గురు గ్రామ సర్పంచ్ శాంతవ్వ ఈరన్నను ప్రత్యేకంగా సన్మానించారు. రజక చాకలి సర్పంచులుగా ఎన్నికైన వారిలో పెద్ద తడగూర్ సర్పంచ్ గా శాంతవ్వ ఈరన్న గెలుపొంది రికార్డ్ సృష్టించారు. రవీంద్ర భారతిలో బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో సన్మానం పొందిన సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమం నిర్వాహకుల అందరికీ సర్పంచ్ శాంతవ్వ ఈరన్న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -