Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్వీకరించారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ భూభారతి, రెవెన్యూ సదస్సులు, ప్రజావాణిలో ఉన్న పెండింగ్ దరఖాస్తులపై సమీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 32 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. ఈ గ్రీవెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -