Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలి

పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలి

- Advertisement -

ప్రభుత్వ స్పందించకుంటే ప్రజా భవన్ ముట్టడిస్తాం
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్ధల నాగరాజు, పెద్ది సూరి డిమాండ్ చేశారు. గురువారం యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల యజమాన్యాలు చేపట్టిన బంద్ కు మద్దతుగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఉరి తాళ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిద్దల నాగరాజు, పెద్ది సూరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలు నుండి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల లక్షల మంది విద్యార్థులు మరియు వేల సంఖ్యలో బోధన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితిలో కూడా లేకపోవడం బాధాకరం అని అన్నారు.

అదేవిధంగా దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ఎస్సీ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పథకాన్ని ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తూ ఉండడాన్ని చూస్తుంటే మీ పార్టీ తీసుకొచ్చిన పథకాన్ని మీరే నాశనం చేస్తున్నారు ఇక ప్రజలకు మీరేం ప్రజాపాలన అందిస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు మరియు విద్యార్థులు అనేక సందర్భాలలో మొరపెట్టుకున్న విడుదల చేయాలని సోయి లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ డిపార్ట్మెంట్ చే దర్యాప్తు చేయిస్తామని చెప్పడం మరియు ఉప ఎన్నికపై మాత్రమే దృష్టి పెట్టడం మన దౌర్భాగ్యం అని అన్నారు.

అలాగే ఈనెల మూడో తేదీ నుండి ప్రైవేటు డిగ్రీ,ఇంజనీరింగ్,బి ఫార్మసీ కళాశాలలు నిరవధికగా బందును చేపట్టడం వలన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంలో ఉన్న ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల తో చర్చలు జరిపి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ & ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే రకంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాల్ని కలుపుకొని లక్షల మంది విద్యార్థులతో రాష్ట్రవ్యాప్త ఉధృతమైన ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మరియు యూఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జవహర్ సింగ్, వేణుగోపాల స్వామి చారి, సురేందర్  చరణ్, సాయి ,ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -