Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవికలాంగుల పింఛన్‌ను రూ. మూడు వేలకు పెంచాలి

వికలాంగుల పింఛన్‌ను రూ. మూడు వేలకు పెంచాలి

- Advertisement -

– కేంద్ర మంత్రి వీరేందర్‌ కుమార్‌కు అడ్లూరి లక్ష్మణ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వికలాంగుల పింఛన్‌ను కేంద్రం వాటాగా రూ. మూడు వేలకు పెంచాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య గురువారం కేంద్ర మంత్రి వీరేందర్‌ కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా ధృక్పథంతో వాటిని పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి వికలాంగుల పింఛన్‌ ఒక్క రూపాయి కూడా పెంచలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 300 ఏ మాత్రం సరిపోవని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు ఐదు వందల రేట్లు పెరిగాయని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img