నవతెలంగాణ – కంఠేశ్వర్
2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం పెన్షనర్స్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా ఇవ్వటం లేదని దీని మూలంగా రిటైర్ అయిన ఉద్యోగులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలని పిల్లల పెళ్లి చేయాలని వైద్యం చేయించుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్నటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం మండి చేయి చూపిస్తోందని వారు అన్నారు. నగదు రహిత వైద్యం ఎండమావిలా తయారైందని వారు ఆరోపించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్మోహన్ జిల్లా నాయకులు ఈ వి ఎల్ నారాయణ, శిల్ప హనుమాన్లు, లావు వీరయ్య, రాధా కిషన్, జార్జ్, హమీదుద్దీన్, దీన సుజన, పురుషోత్తం, సిర్ప లింగయ్య, బట్టి గంగాధర్, వెంకటరావు, మధుసూదన్, సాంబశివరావు, అశోక్, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



