Monday, February 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఎఫ్ ఆఫీసు ముందు పెన్షనర్ల ధర్నా

పిఎఫ్ ఆఫీసు ముందు పెన్షనర్ల ధర్నా

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఆర్టీసీ, ఎన్ ఎస్ ఎఫ్, ఎన్ సి ఎస్ ఎఫ్, తదితర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసి రిటైర్ అయిన వారికి నెలకు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ పిఎఫ్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నాను ఈపీఎస్ పెన్షనర్ల కన్వీనర్ లక్ష్మణ్ అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షులు శిల్ప హనుమాన్లు మాట్లాడుతూ.. ఈపీఎస్ పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్మహిస్తోందని ,కోర్టు తీర్పులను కూడా అమలు చేయడం లేదని ,40 సంవత్సరాలపాటు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పనిచేసి లక్షల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సృష్టించిన ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత నెలకి ₹500, లేదా ₹1000 ఇవ్వటం ఎంతవరకు సమంజసం అని ఆయన అన్నారు. పెన్షన్ నెలకు 9000 రూపాయలు చెల్లించాలని, ప్రయాణాలలో రాయితీలు కల్పించాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ని అమలు చేయాలని, తదితర డిమాండ్లతో కూడిన మెమోరాండంను పిఎఫ్ కమిషనర్ శ్రీ సిద్ధాంత సుహాస్ పాటిల్ గారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల యూనియన్ నాయకులు, కే రామ్మోహన్రావు, ఈ వి ఎల్ నారాయణ, చిన్నయ్య, సాంబశివరావు, రాధా కిషన్, జార్జ్ ,పురుషోత్తం, లావు వీరయ్య, డి. లక్ష్మీనారాయణ, రాజేశ్వర్, ప్రసాదరావు, పుష్ప లీల, లలిత, మేరీ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -