నవతెలంగాణ – దుబ్బాక
అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, చేయూత వృత్తిదారుల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని, అలాగే నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఎమ్మార్పీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి రాజు మాదిగ డిమాండ్ చేశారు. శనివారం దుబ్బాకలోని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ కే. రమేష్ కుమార్ కు వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు ముక్కపల్లి కనకరాజు, వికలాంగులు, చేయూత పెన్షన్ దారులతో కలిసి వినతిపత్రం అందజేశారు. వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్ నాయకులు షాదుల్, దొమ్మట జోగయ్య, కండ్లకోయ శేఖర్, ప్రశాంత్, కుమార్, గడ్డమీది లక్ష్మీ నర్సయ్య, నసీమా, ఎద్దు కుమార్, ప్రభాకర్, శెట్టి నర్సింలు, ఇస్తారిగల్ల రాజయ్య పలువురు పాల్గొన్నారు.
పెన్షన్లను పెంచాల్సిందే: ఎమ్మార్పీఎస్ ముక్కపల్లి రాజు మాదిగ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES