నవతెలంగాణ-హైదరాబాద్: అసోంలో బీజేపీ పాలన చూసి ప్రజలు భయపడుతున్నారని జార్ఖండ్ మంత్రి శిల్పి నేహా తిరికే ఆరోపించారు. గత ఎన్నిలక హామీలను బీజేపీ ఇంతవరకు అమలు చేయలేదని, దీంతో తేయాకు కూలీలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. పైగా ఈ ప్రాంతంలోని తేయాకు తోటలను బలహీనపరిచే కొత్త చట్టాలు, విధానాలు ప్రవేశపెట్టబడ్డాయని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్ మంత్రి శిల్పి నేహా తిరికే అసోంలోని దిబ్రుగఢ్ ప్రాంతాల్లో పర్యటించారు.
ఒక టీ తోటకు వెళ్లినప్పుడు, అనేక చోట్ల చమురు తవ్వకాల కోసం భూమిని సేకరిస్తున్నారని ప్రజలే స్వయంగా చెబుతున్నారు.” చమురు తవ్వకాల వల్ల కలిగే హానికరమైన కాలుష్యం కారణంగా, మొత్తం టీ తోటల సహజ స్వరూపం దెబ్బతింటోందని, పర్యావరణంతో పాటు జీవనోపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని జార్ఖండ్ మంత్రి ఆరోపించారు.



