Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమస్యలు పరిష్కరించిన అధికారులను ప్రజలు మర్చిపోరు 

సమస్యలు పరిష్కరించిన అధికారులను ప్రజలు మర్చిపోరు 

- Advertisement -

రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 
నవతెలంగాణ – మిరుదొడ్డి 

సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పేద ప్రజలను ఆదరించి, వారి సమస్యలు పరిష్కరించిన అధికారులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ప్రతి అధికారి విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ సందర్శనలో భాగంగా గ్రూప్-1 అధికారులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి వచ్చిన అధికారులతో పాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు  గ్రామ సర్పంచ్ ప్రమీల దేవి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య మాట్లాడుతూ..నూతనంగా నియామకమైన గ్రూప్-1 అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించి, పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామీణ పేద ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ఆరుగురు గ్రూప్-1 అధికారులు అల్వాల గ్రామానికి రావడం అదృష్టం అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్రంలో అధికారులుగా నియామకం చేపట్టిన తర్వాత పేదవారికి సహాయపడేలా విధులు నిర్వర్తించాలని కోరారు.

అనంతరం గ్రూప్-1 అధికారులు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. గ్రామస్తులు తమపై అభిమానంతో డప్పు, చప్పులతో స్వాగతం పలికిన తీరును వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో గణేష్ రెడ్డి ఏపిఎం లక్ష్మీనరసమ్మ, ఉప సర్పంచ్ సాయి కుమార్, గ్రామస్తులు దిలీప్ రెడ్డి రాజిరెడ్డి పంచాయతీ కార్యదర్శి రవీందర్ ఐకెపి సిబ్బంది బాలరాజు, జ్యోతి, వరలక్ష్మి ఈశ్వరమ్మ, యమున ,మానస తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -