Saturday, May 24, 2025
Homeఅంతర్జాతీయంరైల్వే ప్లాట్ ఫామ్ పై నిల్చున్నవారిపై కత్తితో దుండగుడి దాడి

రైల్వే ప్లాట్ ఫామ్ పై నిల్చున్నవారిపై కత్తితో దుండగుడి దాడి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జర్మనీలోని హామ్‌బర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడటంతో కలకలం రేగింది. ప్లాట్‌ఫామ్ పై నిలబడి ఉన్న వ్యక్తులపై జరిగిన ఈ దాడిలో 8 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

తొలుత ఈ ఘటనలో 8 మందికి గాయాలైనట్లు వార్తలు రాగా, ఆ తర్వాత ఆ సంఖ్య 12కు పెరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, ఈ ఘటనపై అధికారులు ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని హామ్‌బర్గ్ పోలీసులు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ఈ దాడిలో ఒక్కడే పాల్గొన్నాడని, నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -