- అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్
నవతెలంగాణ-వనపర్తి: ప్రపంచ శాంతి కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్ ఉన్నారు. వనపర్తి జిల్లా కమిటీ సమావేశం ఎత్తం శివ అధ్యక్షతన శనివారం లిటిల్ బర్డ్స్ స్కూల్ శనివారం సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కె.వి.ఎల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ శాంతిని కోరుకునే ప్రగతిశీలులు ఎవరి రాజకీయాలు వారికున్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా ఏ.ఐ.పి.ఎస్.ఓ లో సభ్యులుగా చేరి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా సామ్రాజవాదానికి వ్యతిరేకంగా మానవజాతి ప్రగతి కోసం జరిగే ప్రపంచశాంతి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
శాంతి తనంతట తాను రాదని ప్రజల జ్ఞాపకం ఉంచుకోవాలని మంచి కోరికల ద్వారా మాత్రమే శాంతి సంపాదించుకోవడం సాధ్యం కాదు, శాంతి కోసం పోరాటం జరపాలి అని ప్రఖ్యాత రచయిత ఎర్నకోవా, వి.రాత్నికోవ్ చెప్పారన్నారు. జిల్లాలో సభ్యత్వాన్ని పూర్తిచేసుకుని రాష్ట్ర మహాసభలకు జాతీయ మహాసభలకు సన్నద్ధం కావాలన్నారు. పచ్చిమాసియాలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ప్రపంచ యుద్ధంగా మారకముందే పరస్పర చర్చల ద్వారా వాటిని వెంటనే ఆపివేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా కవి జనజాల, ఏఐపీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహ శెట్టి, గట్టు యాదవ్, విజయ రాములు, సహాయ కార్యదర్శులు భరత్, రమేష్, గోపాలకృష్ణ, అనంతరాజు, కృష్ణయ్య, రాంబాబు, రవి, అశోకు,లక్ష్మి, రవీందర్, శ్యాంసుందర్,రాజశేఖర్, చందు, వంశీ, నరేందర్ రెడ్డి, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు.



