Sunday, August 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీతాయిపల్లి, కంచుమల్ అడవి ప్రాంత రహదారుల వెంట చిరుత సంచారం

సీతాయిపల్లి, కంచుమల్ అడవి ప్రాంత రహదారుల వెంట చిరుత సంచారం

- Advertisement -

చిరుత సంచారంతో భయాందోళనలో వివిధ గ్రామాల ప్రజలు

నవతెలంగాణ గాంధారి: గాంధారి మండలంలోని సీతాయిపల్లి, కంచుమల్ అడవి ప్రాంతాల్లో రహదారిపై చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. ఈ రహదారి వెంట నిత్యం ప్రజలు తిరుగుతూ ఉంటారు సీతాయిపల్లి కంచుమల్, కొండాపూర్ వెళ్లే గ్రామ ప్రజలు అటవీ ప్రాంతంలోని రోడ్ల వెంట చిరుత పులి తిరుగుతుంది అనడంతో ఆ రహదారి వెంట వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు.

శనివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతోప్రజలు బ భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఈ రహదారి వెంట ప్రయాణించేవారు తరచుగా ఈరహదారివెంట చిరుతపులులు కనిపిస్తున్నాయని ఈ రహదారి వెంట ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని ప్రజలు భయపడుతున్నారన్నారు. అలాగే శివారు గ్రామాల్లోని రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారు. తక్షణమే అటవీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు ప్రయాణికులు కోరుతున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -