నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో కుండపోత వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కీలక మార్గాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక భారీ వర్షాలు కారణంగా ఉద్యోగస్థులంతా మెట్రో రైలుపైనే ఆధారపడ్డారు. అయితే భారీ వర్షాలు కారణంగా పలు స్టేషన్లలో మెట్రో రైల్వే సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులతో స్టేషన్లు కిటకిటలాడాయి. విశ్వవిద్యాలయ-సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్ల మధ్య రైలు సర్వీసులలో ఆలస్యం జరిగిందని మెట్రో పేర్కొంది. అంతేకాకుండా విమాన ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలు కారణంగా విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నట్లు ఆయా సంస్థలు తెలిపాయి.
ఢిల్లీ మెట్రోకు పొటెత్తిన జనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES